చిత్తూరు జిల్లా పుత్తూరులో కిడ్నాప్ కు గురైన ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి గతంలో నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేసే వారు. ఉద్యోగం చేస్తూ వెంకటగిరిలో ఈఓఆర్డీ వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నగదు సేకరించినట్లు సమాచారం.
ఉద్యోగం ఇప్పించక పోగా ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదని సమాచారం. ఈ కారణంగా నగదును రాబట్టేందుకు అతనిని కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకు వచ్చారు. బాధిత వ్యక్తి బంధువులు పోలీసులను ఆశ్రయించిన కారణంగా వెంకటగిరి లో ఉన్న వ్యక్తిని ఆయన స్వగ్రామమైన పుత్తూరుకు తీసుకెళ్లినట్లు ఇక్కడి పోలీసులు తెలిపారు. పుత్తూరు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.