ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో ముఖ్యమంత్రి పర్యటన.. కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌

POLICE HOUSE ARREST THE WORKERS : నెల్లూరులో సీఎం జగన్​ పర్యటన సందర్భంగా కార్మికులు ఆందోళనకు పిలుపునిచ్చారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ప్రైవేట్​పరం చేయవద్దని నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు, నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

POLICE HOUSE ARREST THE WORKERS
POLICE HOUSE ARREST THE WORKERS

By

Published : Oct 27, 2022, 10:51 AM IST

Updated : Oct 27, 2022, 12:36 PM IST

కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

HOUSE ARREST OF THERMAL WORKERS : నెల్లూరులో సీఎం జగన్‌ పర్యటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం.. మరికొద్దిసేపటిలొ ముత్తుకూరు రానున్నారు. ఈ నేపథ్యంలో థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు నిరసనలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిరక్షణ సమితి నాయకులను గృహనిర్బంధించారు. సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ పార్టీ నేత కత్తి శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, సీఐటీయూ నాయకులు అల్లాడి గోపాల్​ను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్​స్టేషన్కు తరలించారు.

Last Updated : Oct 27, 2022, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details