ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడవ చిన్నది.. శిక్ష పెద్దది! - sangam police latest news

ఆటో బాడుగు వివాదం.. ఇద్దరిని పోలీసులు చితకబాదే వరకు వెళ్లింది. ఆ ఇద్దరూ.. ఇప్పుడు తీవ్ర గాయాలపాలై నడవలేని స్థితిలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని సంగంలో ఈ వివాదం జరిగింది.

Police hitting two people
నెల్లూరులో ఇద్దరు వ్యక్తులను కొట్టిన పోలీసులు

By

Published : May 25, 2020, 12:24 PM IST

చిన్న గొడవ.. పెద్ద శిక్ష

నెల్లూరు జిల్లా సంగం పరిధిలోని పెరమన గ్రామానికి చెందిన మల్లి శ్రీను, మల్లి ముని, గుంజి రాజు బంధువులు. ఓ ఆటో బాడుగ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన శ్రీను.. మిగతా ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే.. ఏ మాత్రం విచారణ చేయకుండా ముని, రాజు పై పోలీసులు దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని చెప్పినా కూడా.. ఎస్సై, ఏఎస్సై పట్టించుకోలేదని ఆవేదన చెందారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా పట్టించుకోకుండా... ముని, రాజులను చితకబాదారని చెప్పారు. ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారని.. గుంజి రాజు నడవలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. ఆత్మకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details