నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు పన్నంగాడు వద్ద ఆకలితో అల్లాడుతున్న కూలీలకు ఆకలితీర్చారు పోలీసులు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వలసకూలీలు చెన్నైలో పనులు చేసుకుంటున్నారు. 80మందికిపైగా కూలీలు వారి స్వస్థలానికి వెళ్లేందుకు రాష్ట్ర సరిహద్దులోని పన్నంగాడు వద్దకు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని గమనించిన సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి.. వరుసగా అనేక చెక్ పోస్టులు ఉన్నట్లు వారికి తెలిపారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో వెళ్లడం కష్టమని వివరించారు. అలసిపోయి ఆకలితో ఉన్న వారందరికీ శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంధ్రరెడ్డి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. తిరిగి వారిని చెన్నైకి పంపించారు.
వలస కూలీలకు ఆకలి తీర్చిన పోలీసులు - కరోనా ఎఫెక్ట్ న్యూస్
దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలకు పోలీసులు అన్నంపెట్టి ఆకలి తీర్చారు. రవాణా సౌకర్యం లేక బిక్కుబిక్కుమంటూ.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోనే ఉన్నవారిని తిరిగి చెన్నైకి పంపించారు.
వలస కూలీలకు ఆకలి తీర్చిన పోలీసులు