నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పాళెం సమీపంలో చెక్ పోస్ట్ వద్ద అరటి లోడులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్ర చందన దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెలుగొండ అటవీ ప్రాంతం నుంచి ఈ ఎర్రచందనం దుంగలను తీసుకువస్తున్నట్లు నిందితులు తెలిపారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉండటంతో తక్కువ దుంగలను ఇలా తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అరటి లోడులో ఎర్ర చందన దుంగల తరలింపు.. ఇద్దరు అరెస్ట్ - అరటి లోడులో తరలిస్తున్న ఎర్ర చందనం స్వాధీనం
అరటి లోడులో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందన దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేశారు.
ఎర్ర చందన దుంగలు