ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూళ్లూరుపేట కౌన్సిలర్‌ సురేశ్‌ హత్యకేసులో ముమ్మర దర్యాప్తు - సూళ్లూరుపేట కౌన్సిలర్‌ సురేశ్‌ హత్య వార్తలు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘం 16వ వార్డు కౌన్సిలర్‌ తాళూరు సురేశ్‌‌(40) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. సురేశ్​ ఆర్థిక లావాదేవీలతో సంబంధాలను ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

sullurupeta
సూళ్లూరుపేట

By

Published : Aug 11, 2021, 11:49 AM IST

నెల్లూరు జిల్లాలోని సూళ్లురుపేట కౌన్సిలర్ సురేశ్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి హత్య చేశారని పోలీసులు తెలిపారు.

సూళ్లూరుపేటలో ఈ నెల 9న 16వ వార్డు కౌన్సిలర్‌ తాళూరు సురేశ్‌‌(40) దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం 10 మంది ఎస్ఐలు, సీఐలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సురేశ్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తే దారుణానికి పాల్పడినట్లు సమాచారం. సురేశ్​ ఆర్థిక లావాదేవీలతో సంబంధాలను ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి

సూళ్లూరుపేట వైకాపా కౌన్సిలర్‌ తాళ్లూరి సురేశ్‌ హత్య

ABOUT THE AUTHOR

...view details