ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Madhureddy murder case: మధురెడ్డి హత్యకు కారణాలివే..!

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామంలో గత నెల 22న జరిగిన మధురెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పొలం విషయంలో తలెత్తిన వివాదం, తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతోనే గోపి అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.

murder
కక్షపూరితంగా హత్య

By

Published : Aug 5, 2021, 6:41 PM IST

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పెద్దపుత్తేడులో జరిగిన మధురెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు. దగదర్తి మండలానికి చెందిన అల్లాడి గోపి, కొండూరు మధురెడ్డిల మధ్య గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. పొలం విషయంలో ఇబ్బంది పెట్టడమే కాకుండా, గోపి భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే మధురెడ్డి హత్యకు కారణంగా డీఎస్పీ తెలిపారు.

హత్య జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారం దొరక్కపోయినా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసు ఛేదించాము. గోపి... రౌడిషీటరైన తన బావమరిది సురేంద్రబాబుతో కలిసి మధురెడ్డి హత్యకు పథక రచన చేశాడు. కొందరు కిరాయి రౌడీలకు మూడు లక్షల రూపాయల నగదు ఇచ్చి మధురెడ్డిని హత్య చేసేందుకు పూనుకున్నారు. మధురెడ్డిని నలభై సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. పరారీలో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటాం. హత్య కేసు ఛేదించిన పోలీసులకు అభినందనలు : హరినాథ్ రెడ్డి, నెల్లూరు రూరల్ డీఎస్పీ

ABOUT THE AUTHOR

...view details