నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ముగ్గురు ఎస్సీ వ్యక్తులు ఆవులను కట్టేయగా... వారిని గో పరిరక్షణ సమితి సభ్యులు అర్ధనగ్నంగా నడిపించు కుంటూ పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మానవ హక్కులు సంఘం సభ్యులు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
arrest: గో పరిరక్షణ సమితి సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - నెల్లూరు జిల్లా అర్ధనగ్న ప్రదర్శన వార్తలు
నెల్లూరు జిల్లాలో ఎస్సీలు ఆవులను కట్టేయగా.. వారిని పట్టుకుని గో పరిరక్షణ సమితి సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనపై మానవ హక్కులు సంఘం సభ్యులు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారకులైన గో పరిరక్షణ సమితి సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
arrest
ఫిర్యాదు స్పందించిన పోలీసులు.. గో పరిరక్షణ సమితి సభ్యులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి, అల్లంపాటి రమణారెడ్డి, కొమ్ము తిరుపతి నాయుడులపై అరెస్టు చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింది కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి