నెల్లూరులోని సరస్వతి నగర్లో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎనిమిది మంది పేకాట రాయుళ్లలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.ఐదు లక్షల నగదు, ఎనిమిది సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహకుడు ప్రశాంత్ కుమార్ పరారీలో ఉండగా... త్వరలోనే అతడిని పట్టుకుంటామని నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఎనిమిది మంది అరెస్ట్
నెల్లూరు నగరంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
police have arrested 8 peoples playing poker game