ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీళ్ల ట్యాంకర్​లో ఎర్ర చందనం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు - red wood sumgling cases in nellore

ఎవరికీ అనుమానం రాకుండా ట్యాంకర్​లో అక్రమంగా తరలిస్తున్న 92 ఎర్రచందనం దుంగలను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.25 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 9 మందికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

నీళ్ల ట్యాంకర్​లో ఎర్ర చందనం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు
నీళ్ల ట్యాంకర్​లో ఎర్ర చందనం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు

By

Published : Dec 5, 2019, 11:59 AM IST

అక్రమంగా తరలిస్తోన్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న పోలీసులు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం చింతోడు అటవీ ప్రాంతం నుంచి నీళ్ళ ట్యాంకర్​లో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రూ.1.25 కోట్ల విలువ చేసే 92 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతోడు గ్రామానికి చెందిన రాచూరి రవి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి నిల్వ చేశారని డీఎస్పీ ప్రసాద్​ తెలిపారు. వాటిని వింజమూరుకు చెందిన భీమిరెడ్డికి విక్రయించగా.. అతను గుట్టుచప్పుడు కాకుండా నీళ్ల ట్యాంకర్​లో వాటిని తరలిస్తున్నట్లు గుర్తించి.. తనిఖీ చేశామని అన్నారు. ట్రాక్టర్​తో పాటు ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు భీమిరెడ్డి ఓబుల్​రెడ్డి, పవన్​కుమార్​లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మరో 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details