ఈనెల 17న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇస్తే.. ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో 42 కేసులు నమోదైనందున.. ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి వెల్లడించారు. పాదయాత్రలో నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని వివరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకుంటామని శివారెడ్డి స్పష్టం చేశారు.
AMARAVATHI FARMERS: తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే..హైకోర్టుకు వెళ్తాం: శివారెడ్డి - AP NEWS
అమరావతి రైతులు ఈనెల 17న ర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
ఈనెల 17 సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. హైకోర్టుకు వెళ్తాం..!