నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు విచారణలో తెలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆత్మకూరు సీఐ సోమయ్య వెల్లడించారు. దేపూరు గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనపై గ్రామస్థుల ఫిర్యాదుతో ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. అందులో భాగంగా మృతుని భార్య వెంకట సుబ్బమ్మ.. ఆమె ప్రియుడు పెంచలయ్యతో కలిసి వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు నిర్ధారించారు.
అసలేం జరిగింది..
కటారి వెంకటేశ్వర్లు-వెంకట సుబ్బమ్మ దంపతులు మేకలు కాస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు సోదరి భర్త పెంచలయ్యతో సుబ్బమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ తరుణంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన సుబ్బమ్మ.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం రూపొందించింది.
పథకం ప్రకారమే...