ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ఇద్దరి పట్టివేత - అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏదో రూపంలో రవాణా అవుతూనే ఉంది. తాజాగా.. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద సెబ్ అధికారులు వాహన తనీఖీలు చేపట్టగా.. వేర్వేరు బస్సుల్లో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద గంజాయి లభించింది. వారి వద్ద నుంచి సెబ్ అధికారులు రూ.లక్ష విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

police caught two people at nellore venkatachalam toll plaza for illegal tranport of ganjai
ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సెబ్ అధికారులు

By

Published : Oct 29, 2021, 9:48 PM IST


ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతూనే ఉన్నాయి. తాజాగా.. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 32 కిలోల గంజాయిని నెల్లూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరి వద్ద ఈ గంజాయి పట్టుబడింది.

కేరళకు చెందిన మహ్మద్ సహాజ్.. రాజమండ్రిలో కిలో గంజాయిని కొనుగోలు చేసి, బట్టల బ్యాగులో దాచి, ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకువెళ్తున్నాడు. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. సెబ్ అధికారులకు పట్టుబడ్డాడు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన దేవి అనే మహిళ 20కిలోల గంజాయిని.. మరో ఆర్టీసీ బస్సులో తిరుపతికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.లక్ష మేర ఉంటుందని, బహిరంగ మార్కెట్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంద పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

కొడుకును కాపాడుకునేందుకు.. 6 కి.మీల డోలీమోత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details