ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనాన్ని తస్కరించి.. 24 గంటల్లో పోలీసులకు చిక్కి..! - యజమాని వాహనాన్ని దొంగిలించిన డ్రైవర్

అతను బొలేరో డ్రైవర్​గా విధులు నిర్వర్తించాడు. కొన్ని రోజులకు తాళం పోయిందని నాటకమడాడు. పని మానేసిన అనంతరం అదే వాహనంతో ఉడాయించాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

ss
డ్రైవర్​గా పని చేసిన వాహనాన్ని తస్కరించి.. 24 గంటల్లో పోలీసులకు చిక్కి

By

Published : Feb 26, 2021, 4:07 PM IST

నెల్లూరులో ఓ వాహన దొంగను పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 24వ తేదీన బొలెరో వాహనం చోరీకి గురైంది. చో‌రీపై యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుచ్చి, ఆత్మకూరు టోల్ గేట్ల వద్ద విచారించిన పోలీసులు వాహనం చెన్నైకి తరలిస్తుండగా పట్టుకున్నారు.

గతంలో ఆ వాహనానికే డ్రైవర్​గా పనిచేసిన శివ అనే వ్యక్తే దొంగని పోలీసులు గుర్తించారు. డ్రైవర్​గా పని చేసే సమయంలో తాళం పోయిందని యజమానిని నమ్మించాడు. పని మానేసిన తర్వాత ఆ వాహనాన్నే చోరీ చేశాడు. ఒకరోజు వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులను నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి:జొన్నవాడ క్షేత్రం చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details