నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీఎస్ఆర్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఎస్ఐ రవి నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పట్టణ పుర ప్రముఖులు, ఆటోనగర్ మెకానిక్ వర్కర్స్, విద్యార్థులు హాజరయ్యారు.. పోలీసు అమర వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.
ఆత్మకూరులో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ - ఆత్మకూరులో బిఎస్ఆర్ సెంటర్
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీఎస్ఆర్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఆత్మకూరులో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ