నెల్లూరు జిల్లా కోవూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్న సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న కారణంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మంత్రి బాలినేని, ఎమ్మెల్యే ప్రసన్న.... కోవూరు స్టౌబీడీకాలనీ, సాలుచింతలలో పర్యటనకు వెళ్లారు. వరదల సమయంలో అష్టకష్టాలు పడ్డ తమను పట్టించుకోని నాయకులు ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ బాధితులు వారితో వాగ్వాదానికి దిగారు.
కోవూరులో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు - nellore district latest updates
మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్న సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న కారణంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
కోవూరులో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ఈ సన్నివేశాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న కారణంతో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటున్నవారిపై అక్రమంగా కేసులు బనాయించారని జనసేన నేతలు ఆరోపించారు.