నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పుచ్చలపల్లివారి వీధిలో షకీలా హత్యలో భాగంగా ముద్దాయి అక్తర్‌ని మద్దూరుపాడు సెంటరులో సీఐ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై డీఎస్పీ మాట్లాడుతూ...షకీలా, అక్తర్‌ల మధ్య రెండేళ్లుగు వివాహేతర సంబంధం ఉందని తెలిపారు. కొద్దిరోజులుగా షకీలా వేరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో వారిద్దరి మధ్య వివాదం జరిగిందని.. ఈ నేపథ్యంలో అక్తర్.. షకీలా గొంతునులిమిచంపాడని తెలిపారు. నిందితుడిని రిమాండుకు పంపుతున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.
హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు - కావలి తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన షకీలా హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మృతురాలి ప్రియుడేనని డీఎస్పీ తెలిపారు.
police arrest murder case culprits in nellore dst