ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదు: మంత్రి అనిల్‌ - మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుపై తెదేపా అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Minister Anil kumar yadav
Minister Anil kumar yadav

By

Published : Nov 15, 2020, 5:54 PM IST

Updated : Nov 15, 2020, 7:24 PM IST

మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కావాలంటే ఎవరైనా వచ్చి ఎత్తు కొలుచుకోవచ్చన్నారు. ఆదివారం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. పోలవరంపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

ఆర్ అండ్ ఆర్​ని అమలు చేయలేని తెదేపాకు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోలవరానికి సంబంధించి మొదటి విడత కింద మార్చి నాటికి 20వేల కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.

Last Updated : Nov 15, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details