ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు! - మహిళలతో ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ అసభ్య ప్రవర్తన వార్తలు

అతడో ఉన్నతమైన బ్యాంకు అధికారి.. కానీ ఆలోచనలు మాత్రం పక్కదారి. అవసరం కోసం.. వచ్చే మహిళలే.. అతడి టార్గెట్. వారిని ఎలా లోబర్చుకోవాలా? అనేది ఆ బ్యాంకు మేనేజర్ వక్రబుద్ధి.. అక్కడ.. ఇక్కడ కాదు.. ఏకంగా బ్యాంకులోనే.. మహిళలతో అసభ్య ప్రవర్తన. సీసీ టీపీ ఫుటేజ్ బయటకు రావడంతో.. ఆ బ్యాంకు అధికారి వ్యవహారం బయటపడింది.

podalakur-sbi-manager
podalakur-sbi-manager

By

Published : Jul 3, 2021, 5:57 PM IST

బ్యాంకుకు వెళ్లే మహిళలే టార్గెట్.. సీసీ కెమెరా ఉన్నా పట్టించుకోడు!

బ్యాంకుకు వచ్చే మహిళలపైనే అతడి కన్ను. ఎలాగైనా లోబర్చుకోవాలనుకుంటాడు. అవసరం కోసం వచ్చిన వారిని ఏదోలా చూస్తాడు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎస్​బీఐ బ్యాంకు మేనేజర్ నగేశ్.. మహిళా ఖాతాదారురాల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై అధికారులు విచారణ చేప్టటారు.

రుణాల కోసం వచ్చే మహిళల పట్ల మేనేజర్ నగేశ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు బయటకు లీకవ్వడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details