ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్త బండిలో సుప్రభాతం... ఎందుకో తెలుసా? - playing suprabhatham in municipal van in naidupeta news

చెత్తను సేకరించటానికి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చేపట్టిన కార్యక్రమం స్థానికుల చేత ప్రశంసలు పొందుతోంది. ఇంతకు అసలు ఎటువంటి కార్యక్రమం చేపట్టారో తెలుసుకోవాలని ఉందా?

చెత్త బండిలో సుప్రభాతం ఎందుకో తెలుసా?

By

Published : Nov 25, 2019, 10:33 AM IST

Updated : Nov 25, 2019, 10:50 AM IST

చెత్త బండిలో సుప్రభాతం ఎందుకో తెలుసా?
ఇంటింటా చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఎలా వస్తారు? ఏంటి కొత్తగా అడుగుతున్నారు అనుకుంటున్నారా? అవునండీ మరి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి ఈ ప్రశ్న అడగటం మామూలైపోయింది. పొద్దుపొద్దునే విజిల్ వేసుకుంటూ చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ మాత్రం సుప్రభాతం వినిపిస్తున్నారు. ఈరోజు నుండే మెుదలుపెట్టిన ఈ మేలుకొలుపు కార్యక్రమం స్థానికుల చేత ప్రశంసలు పొందుతోంది. సుమారు పది వాహనాలకు మైక్​ సెట్లను అమర్చి సుప్రభాతాన్ని వినిపిస్తున్నారు. ఉదయాన్నే సుప్రభాతం వినటం వలన ప్రజలు మానసిక ప్రశాంతత పొందుతారని నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Nov 25, 2019, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details