దుకాణదారుడు ప్లాస్టిక్ సంచులను వాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఆర్డీవో ఉమాదేవి ఆధ్వర్యంలో ఆత్మకూరులో భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని అన్ని దుకాణాల్లో తనిఖీ నిర్వహించి,20 కేజీలు ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. కొందరు వ్యాపారస్తులు స్వచ్చందగా ప్లాస్టిక్ సంచులు వాడమని మున్సిపల్ అధికార్లకు ఇచ్చేశారు.
ప్లాస్టిక్ కవర్లు వాడే దుకాణాలపై చర్యలు:మున్సిపల్ అధికార్లు - ర్యాలీ
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్లాస్టిక్ నియంత్రణపై ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్ల వాడితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు.
ప్లాస్టిక్ నియంత్రణకు నెల్లూరులో ర్యాలీ