ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నించిన దళిత రైతుపై అధికారులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్‌ను ధాన్యం కొనుగోళ్లలో దళారులు మోసగించారు. విషయం అధికారులకు తెలియజేస్తే... తిరిగి ఆయనపైనే చీటింగ్ కేసు నమోదు చేశారు. దాంతో అతని తల్లి అచ్చమ్మ, తెదేపా నేతలతో కలిసి డీఆర్ఓ రమణకు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు నిజాయితీపరుడని, విషయం తెలుసుకోకుండా అతనిపై దొంగతనం ముద్ర వేయడమేమిటని ప్రశ్నించారు. కేసులతో వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని కన్నీరుమున్నీరు అయ్యారు. చొక్క పట్టుకుని పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారని విలపించారు. తప్పు చేయకపోయినా దొంగతనం ముద్రపడిందని, జిల్లా పాలనాధికారి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
కేసు నమోదు చేయడం అన్యాయం