నెల్లూరు జిల్లా సూళ్లురుపేటకు చెందిన నాగార్జున... కలెక్టర్ కార్యాలయానికి కుటుంబంతో సహా వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టర్ కార్యాలయంలోకి పెట్రోలు బాటిల్‌తో వచ్చి... శరీరంపై పోసుకుని అగ్గిపుల్ల వెలిగించే సమయానికి పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఆ యువకుడిని పట్టుకుని నీళ్లుపోశారు. భార్య, ఇద్దరు చిన్నపిల్లలు భయపడిపోయారు. డీఆర్వో మల్లిఖార్జున, అధికారులు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు తన సమస్యను వివరించాడు నాగార్జున. ప్రస్తుతం సైదాపురంలో ఎమ్మార్వోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి... తన వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి పనిచేయలేదని ఆరోపించాడు. తాను మధ్యవర్తిగా ఉండి రైతుల భూములకు అనుమతులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని చంద్రశేఖర్‌కి ఇచ్చినట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పని కాకపోవటంతో రైతులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, అందువల్లనే ఆత్మహత్య చేసుకోబోయినట్లు వివరించాడు.
అధికారి మోసం.... కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం! - నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహితుడు
రైతుల భూములకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి.. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశాడు ఓ వ్యక్తి. ఆ మెుత్తాన్ని మండల రెవెన్యూ అధికారికి ఇచ్చాడు. కానీ ఆ అధికారి పనిచేయకపోవటంతో ఏమి చేయలేక కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించాడు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహితుడు