నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి జరిగింది. హరిజనవాడ కాలనీని గుండ్రా సతీష్ రెడ్డి నగర్ అని మార్చగా.. దళితుల కాలనీకి ఆయన పేరు పెట్టడాన్ని మోరా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తప్పుపట్టాడు. మనస్థాపంతో మంత్రి కాన్వాయ్ ముందే పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు.
మంత్రి ఎదుటే ఇంత జరిగినా ఏమాత్రం పట్టనట్లుగా ఆయన కాన్వాయ్‌లో వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోరా భాస్కర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డితో పాటు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలనలో...