నెల్లూరు జిల్లాలో ఈ నెల ఎనిమిదో తేదీన ఏడేళ్ల బాలికపై స్థానికంగా ఉండే వ్యక్తి లైంగిక దాడకి పాల్పడ్డాడు. బిస్కెట్లు, చాక్లెట్లు కొనిస్తానంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక ఇంటికి వచ్చాక కుటుంబసభ్యులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్టు - నెల్లూరులో బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు వార్తలు
నెల్లూరు జిల్లాలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన దిశ స్టేషన్ పోలీసులు.. పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మార్చిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 9 పొక్సో కేసులు నమోదైనట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ వ్యక్తి మాటలు నమ్మి ఓ వివాహిత కుటుంబానికే దూరమైందని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళను పరాయి వ్యక్తుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తుండటంతో తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళలు, పిల్లల పట్ల ఎలాంటి వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి:భర్త కళ్లముందే సామూహిక అత్యాచారం