నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడకు చెందిన కార్నా వెంకట చలపతి అనే వ్యక్తి శ్వాస సమస్యలతో కన్నుమూశాడు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిన స్థితిలో.. అతడి బందువులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంతసేపు చెట్టు కింద, అనంతరం ట్రై సైకిల్ మీద కూర్చోబెట్టారు. చివరికి అక్కడి సిబ్బంది సరిగా పట్టించుకోలేదని.. ఆక్సిజన్ అందక తీవ్రంగా కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబీకులు ఆవేదన చెందారు. ఈ సంఘటన చూపరులను కలిచివేసింది.
ఇదీ చదవండి:అయినా కానీ.. ఖర్చు చేయరు ..!