విద్యుదాఘాతంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ యువకుడు మృతి చెందాడు. జయపురం గ్రామంలో మామిడి రైతు... తోటల్లోకి అడవి పందులు ప్రవేశించకుండా చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. నెమల్లదిన్నె గ్రామానికి చెందిన రాగి వీరాంజనేయులు ఆ విద్యుత్ కంచెను గమనించక తోటలోకి ప్రవేశించబోయాడు. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సత్యనారాయణృ స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టాడు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి - యర్రగొండపాలెం తాజా క్రైం వార్తలు
అడవి పందులు ప్రవేశించకుండా ఓ మామిడి రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. తోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అతడు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో జరిగింది.
![విద్యుదాఘాతంతో యువకుడి మృతి person died out of current shock in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7245847-479-7245847-1589791742179.jpg)
జయపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి