ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరులో లాక్డౌన్ నిర్ణయాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు రోడ్ల మీదకు రాకూడదని హెచ్చరించారు. వాహనాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నిత్యవసరాలు, అత్యవసర పనుల కోసం వచ్చే వారిని మాత్రేమే అనుమతిస్తామన్నారు. ఈ నెల 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
'లాక్ డౌన్‌కు ప్రజలందరు సహకరించాలి' - ఏపీ నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్
నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుందని.. ప్రజలు ఇంట్లో నుంచి రోడ్ల మీదకు రావద్దని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు
ఇవీ చదవండి