రోజులు గడుస్తున్నా ఉల్లి ధరలు దిగిరావడం లేదు. ఉల్లి కోసం వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. పెరిగిన ఉల్లి ధరల నియంత్రణకు రైతు బజార్ల ద్వారా రాయితీపై ప్రభుత్వం అందిస్తున్నా... పడిగాపులు తప్పడం లేదంటున్నారు ప్రజలు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ధర ఎంత ఉన్నా కొనుగోలు తప్పడం లేదని వాపోతున్నారు సామాన్యులు. కిలో ఉల్లి రూ.140 వరకూ పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.
నెల్లూరు జిల్లాలో పది రోజుల కిందట కిలో రూ.60 ఉండగా... ఇప్పుడు రూ.100 నుంచి రూ.140 వరకు పలుకుతుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి ఎక్కువగా ఉంటుంది. వర్ష ప్రభావంతో పంట సరిగా లేక ఈ ఏడాది ఎగుమతి తగ్గింది. పెరుగుతున్న ధరలు అవకాశంగా తీసుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అధికారులు తనీఖీలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు.
దిగిరానంటున్న ఉల్లి... బోరుమంటున్న సామాన్యుడు!! - onion problems at nellore news
రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలతో రాష్ట్రంలో వినియోగం తగ్గింది. పెరిగిన ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై వినియోగదారులకు అందిస్తుంది. అయినా గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు కొనుగోలుదారులు.
ఉల్లితో ఇబ్బందులు పడుతున్న నెల్లూరు ప్రజలు
ఇదీ చదవండి: