నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో బ్యాంకుల వద్ద ప్రజలు గుంపులుగా చేరడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న దశలో ప్రజలు బ్యాంకులకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చాలా మంది భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు.
లాక్డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇవ్వడానికి.. సోమవారం కావడం వల్ల ఎక్కువ మంది ఖాతాదారులు బ్యాంకు, ఏటీఎంల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొన్ని బ్యాంకుల సిబ్బంది సైతం సరైన ఏర్పాట్లు చేయని కారణంగా.. జనం క్యూలో నిలబడ్డారు. కొందరు కనీసం మాస్కులు సైతం ధరించకుండా బ్యాంకులకు వచ్చారు.