ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ అమల్లో ఉన్నా.. పాటించడంలో నిర్లక్ష్యం... - నెల్లూరులో లాక్​డౌన్ పాటించని ప్రజలు

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు పాటించడం లేదు. నెల్లూరు పట్టణంలో ప్రజల నిత్యావసరాల కొనుగోలు పేరుతో అధిక సంఖ్యలో బయటకు వస్తున్నారు.

People who do not practice lock down in Nellore
నెల్లూరులో లాక్​డౌన్ పాటించని ప్రజలు

By

Published : Apr 14, 2020, 7:34 AM IST

నెల్లూరు నగరంలో లాక్​డౌన్​ పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలు పేరుతో బయటకు వస్తున్నారు. స్థానిక స్టోన్​హౌస్ పేట మార్కెట్ కూడలిలో గుంపులుగా సరుకులు కొనుగోలు చేశారు. మార్కెట్ కూడలిలో వందకు పైగా దుకాణాలు ఉన్నాయి. ప్రతి దుకాణం వద్ద దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ద్విచక్రవాహనంపై సైతం ఇద్దరు, ముగ్గురు కలిసి తిరుగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details