ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలస్యంగా రేషన్ పంపిణీపై.. లబ్ధిదారుల ఆగ్రహం - anantasagaram news

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో రేషన్ సరకులను ఆలస్యంగా పంపిణీ చేయడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతూ నిరసనకు దిగారు.

people agitated for ration late distribution
20న రేషన్ పంపిణీపై లబ్ధిదారుల ఆగ్రహం

By

Published : May 20, 2021, 12:56 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో రేషన్ పంపిణీ వాహన డ్రైవర్ తో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగారు. ప్రతి నెలా 5 వ తేదీకి పూర్తిచేయాల్సిన రేషన్ బియ్యం పంపిణీని.. 20 నాటికి కూడా కొనసాగిస్తుండడంపై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంపిణీని అడ్డుకుని వాహన తలుపులు మూసేసి నిరసన వ్యక్తం చేశారు. కేవలం ఒక్కబండితోనే పంపిణీ చేయడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని.. ఇందుకోసం మరో వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి తమకు సమయానికి రేషన్ పంపిణీ పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details