సకాలంలో పింఛన్ పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నెల్లూరులో వృద్ధులు ధర్నాకు దిగారు. నగరంలోని ఏసీ ఉన్నత పాఠశాల వద్ద పింఛన్ ఇవ్వాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే పింఛన్ ఇప్పుడు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల ప్రభుత్వం అందజేసే పింఛన్ సొమ్ముతోనే తమకు అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నామని,.. ప్రస్తుతం పింఛన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని ప్రతి నెల ఆలస్యం కాకుండా పింఛన్ పంపిణీ చేయాలని కోరారు.
ఒకటో తేదీకల్లా పింఛను ఇప్పించండి! - పింఛను లబ్ధిదారులు
ఒకటో తేదీకల్లా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పింఛన్దారులు నెల్లూరులో ధర్నా చేశారు.
ధర్నా చేస్తున్న వృద్ధులు ...