ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెన్నా పరివాహక ప్రాంతంలో 638 ఎకరాలు కబ్జా' - పెన్నా నది కబ్జా న్యూస్

పెన్నా పరివాహక ప్రాంతంలో 649 సర్వే నెంబర్‌లో అక్రమణలు జరిగాయని నీళ్లపల్లి గ్రామస్థులు ఆరోపించారు. 638 ఎకరాలు కబ్జా చేసి సాగు చేస్తున్నారన్నారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుంటూ భూమిని కట్టబెట్టారన్నారు.

penna lands occupied
penna lands occupied

By

Published : May 9, 2021, 12:17 AM IST

నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పుల్ల నీళ్లపల్లి గ్రామంలో పెన్నా పరివాహక ప్రాంతంలో 649 సర్వే నెంబర్‌లో ఉన్న 638 ఎకరాలు కబ్జా చేసి.. సాగు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొందరు లంచాలు తీసుకుంటూ. బయట వ్యక్తులకు ఈ భూములు కట్టబెట్టారని వారు చెబుతున్నారు. ఆ పొలాలకు.. విద్యుత్‌ సదుపాయం కల్పించే క్రమంలో అక్కడికి వెళ్లిన గ్రామస్థులతో..భూమలు సాగు చేసుకుంటున్న వారు గొడవపడ్డారు. విషయం తెలుకొని ఘటనా స్థలానికి చేరుకొన్న అధికారులు ఇరువురితో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'పెన్నా పరివాహక ప్రాంతంలో 638 ఎకరాలు కబ్జా'

ABOUT THE AUTHOR

...view details