ఇదీ చదవండి :
వరద ప్రవాహానికి కూలిన వంతెన
నెల్లూరు నుంచి కోవూరు వైపు వెళ్లే వంతెన నీటి ప్రవాహానికి కుప్పకూలిపోయింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా దెబ్బతిన్నది. నీటి ప్రవాహం వచ్చే స్లూయిజ్ వద్ద కాంక్రీట్ బీటలు వారింది. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. సోమశిల నుంచి పెన్నానదిలోకి వరద ప్రవాహం రావడంతో 630 మీటర్లు వ్యాసార్థం, 20 అడుగులు పొడవైన వంతెన కూలిపోయింది. ఇప్పటి వరకూ నెల్లూరు వంతెన కింద నుంచి ప్రజలు రాకపోకలు చేస్తుండేవారు. వారధి తూములు కూలిపోవడంతో రాకపోకలకు అవకాశం లేదు.
వరద ప్రవాహానికి కూలిన వంతెన