ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న పెన్నా వంతెన - పెన్నా బ్యారేజీ వార్తలు

గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలు, నివర్‌ తుపాను కారణంగా పెన్నా నదిలోకి సుమారు 3లక్షల 70 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు చేరింది. దీంతో వరద ప్రవాహ సమయంలో నీటి ఉద్ధృతికి పెన్నా బ్యారేజీ వద్ద వంతెన తెగిపోయింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ... తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారని... పెన్నా బ్యారేజీ నిర్మాణం పూర్తైతేనే తమకు మేలు జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా రైతులుసాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా రైతులు
సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా రైతులుసాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా రైతులు

By

Published : Jan 1, 2021, 5:33 PM IST


ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ... రైతుల బాధను పట్టించుకున్న నాథుడు లేడని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. వంతెన తెగిపోయిన ప్రతిసారి... తాత్కాలిక మరమ్మతులు చేయడం తప్ప, పెన్నా బ్యారేజీ పనులు పూర్తి చేయడం లేదన్నారు. జిల్లాలో చాలాచోట్ల ఇదివరకే నాట్ల ప్రక్రియ కొనసాగుతోందని... ఈ సమయంలో పంటకు సమృద్ధిగా సాగు నీరందకుంటే రైతులు నష్టపోతారని వారు చెబుతున్నారు.


ఇప్పటికే పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని... పెన్నా బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నెలలోకురిసిన వర్షాలకు బ్యారేజీ కింద ఉన్న వంతెన దెబ్బతిందని... ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి బ్యారేజీ పనులు పూర్తిచేసి రైతులకు సమృద్ధిగా నీరందిస్తామని ఆయన తెలిపారు.

అధిక వర్షాల వల్ల జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తుంటే తమకు మాత్రం సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదని.... అధికారులు స్పందించి పెన్నా బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న పెన్నా నది వంతెన

ఇవీ చదవండి

నూతన ఆశయాలతో కొత్త ఏడాదికి స్వాగతం ..

ABOUT THE AUTHOR

...view details