వచ్చే ఏడాది జనవరిలో పెన్నా బ్యారేజీని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులోని పెన్నా బ్యారేజీ గేట్లు అమరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘డిసెంబరు కల్లా ఈ బ్యారేజీ పనులు, ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే సంగం బ్యారేజీ పూర్తి చేస్తాం. కొన్నేళ్లుగా ప్రతిపాదనలో ఉన్న ముదివర్తి పాళెం కాజ్‌వే పనులు రూ.94 కోట్లతో చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ మొదలవుతోంది. సోమశిల, కండలేరు పనులు ప్రారంభిస్తాం...’ అని వివరించారు. కలెక్టర్ చక్రధర్‌బాబు, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, తెలుగుగంగ సీఈ హరినారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.
జనవరిలో సీఎంతో పెన్నా బ్యారేజీ ప్రారంభోత్సవం: మంత్రి అనిల్ - నెల్లూరు జిల్లాలో పెన్నా బ్యారేజీ వార్తలు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులోని పెన్నా బ్యారేజీ గేట్లు అమరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ వరకు బ్యారేజీ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. జనవరిలో సీఎం జగన్ పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తారని వెల్లడించారు.
anil