శాసన మండలి రద్దు చేస్తామని వైకాపా ప్రభుత్వం అనడం చర్చనీయాంశంగా మారిందని... పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. శాసనమండలి అవసరం లేదు... ఖర్చుతో కూడుకుందని ప్రభుత్వం చెప్పడంలో నిజం లేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లులను మండలి అంగీకరించలేదనే కోపంతో రద్దు చేస్తామని చెప్పడం మంచిదికాదని హితవు పలికారు.
శాసనమండలి పెద్దలసభన్న ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం... ప్రభుత్వం చెప్పినట్లే మండలి నడుచుకోవాలంటే సాధ్యపడదన్నారు. పెద్దలసభ మంత్రులు చెప్పినట్లు తల ఊపదని స్పష్టం చేశారు. మంత్రులకు కోపం వచ్చినంత మాత్రాన రద్దు సాధ్యం కాదన్నారు. రద్దుచేయాలంటే.. ఓ ప్రక్రియ ఉందని తెలిపారు. మండలి రద్దు చేసే ఆలోచనే ఉంటే... వైకాపా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.