ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అణగారిన వర్గాలకు.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు" - పవన్​కల్యాణ్​

Pawan Kalyan: తుమ్మలపెంట గ్రామంలో ప్రణయ్​ కుమార్​ హత్యపై జనసేనాని పవన్​కల్యాణ్​ స్పందించారు. ఇప్పుడున్న పాలనలో అణగారిన వర్గాలకు ఎన్నికల్లో పోటి చేసే పరిస్థితి లేదని ట్విటర్​లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

PAWAN KALYAN
పవన్​కల్యాణ్​

By

Published : Nov 8, 2022, 10:54 PM IST

Updated : Nov 9, 2022, 7:08 AM IST

PAWAN KALYAN: ఫ్యూడల్ ఆలోచనలున్న వారి పాలనలో అణగారిన వర్గాలు కనీసం గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా పోటీచేసే పరిస్థితి లేకుండాపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ మండలం తుమ్మలపెంటలో జనసేన తరపున MPTCగా పోటీచేసిన ప్రణయ్ కుమార్ హత్యకు గురికావటంతో ఈ మేరకు స్పందించారు. YCPనేతలే తన కుమారుడిని హత్య చేశారని అతని తల్లి...పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో చలించిపోయిన పవన్ కళ్యాణ్...ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ పరిపాలిస్తున్న రోజుల్లో ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Last Updated : Nov 9, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details