నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత ప్రభాకర్‌రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సత్కరించారు. యువతకు దేహ దారుఢ్యంతో పాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయని జనసేనాని అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచి బాలబాలికలకు ఈ కళలను నేర్పిస్తే అవి ఆత్మరక్షణ విద్యగా, మనోస్థైర్యం ఇచ్చే మార్గంగానూ ఉపయోగపడతాయన్నారు. తాను స్థాపించిన 'లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ట్రస్టు ద్వారా ప్రభాకరరెడ్డికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత ప్రభాకర్‌రెడ్డిని సత్కరించిన పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ తాజా వార్తలు
మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత ప్రభాకర్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సత్కరించారు. తాను స్థాపించిన 'లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్' ట్రస్టు ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించారు.
![గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత ప్రభాకర్‌రెడ్డిని సత్కరించిన పవన్ కల్యాణ్ ప్రభాకర్ రెడ్డిన శాలువతో సత్కరిస్తున్న పవన్ కల్యాణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11170567-491-11170567-1616765818404.jpg)
తాను వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్స్‌లో... మన దేశంలోని శిక్షకుల గురించి శోధిస్తుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసిందని పవన్ చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ లో వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ఆయన... పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊళ్ళో ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం కలిగించిందని జనసేనాని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాను మార్షల్ ఆర్ట్స్‌లో 29 ప్రపంచ రికార్డులు సాధించినట్లు పేర్కొన్నారు. చైనా, థాయిలాండ్, మలేషియా, శ్రీలంకల్లో పలు యుద్ధ కళలు నేర్చుకున్నట్లు వివరించారు. యువతకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉండటం ఎంతో ఉపయోగపడుతుందని... మన దేశంలో వీటిని నేర్చుకుంటున్నవారు తక్కువగానే ఉన్నారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.