ఉదయగిరి సామాజిక ఆరోగ్య వైద్యశాలలో ముగ్గురు డాక్టర్లు ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఒక్కరే అన్నిరకాల రోగులకు వైద్యం చేయాల్సి వస్తోంది. ఫలితంగా.. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఎంత ఎదురు చూసినా... డాక్టర్ వద్ద చూపించుకునే అవకాశం రాని రోగులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక.. ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఇంతటి నిర్లక్ష్యం ఏమిటని నిలదీశారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. విధుల్లో ఉండాల్సిన మరో ఇద్దరు డాక్టర్లలో ఒకరు రాత్రి విధులు నిర్వహించగా... మరొకరు సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
నిరీక్షించలేక నీరసం... వైద్యం కోసం వాగ్వాదం - నెల్లూరు జిల్లా ఉదయగిరిలోో నిరీక్షించలేక నీరసించి... వైద్య సిబ్బందితో వాగ్వాదం
వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు గంటల తరబడి నిరీక్షించినా.. ఫలితం లేకుండా పోతోంది. ఓపిక నశించిన రోగులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ పరిస్థితితో కాసేపు గందరగోళం నెలకొంది.
నిరీక్షించలేక నీరసించి... వైద్య సిబ్బందితో వాగ్వాదం