ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nellore RTC Bus Depot నెల్లూరు ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల వెతలు.. ఎండాకాలం కనీసం తాగునీరు దొరకని దుస్థితి - వేసవిలో ప్రయాణికుల ఇబ్బందులు

Passengers Problems In Summer: వేసవి తాపానికి భయపడి సాధారణంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడంలేదు. ఇంట్లో ఉండేవారే వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ప్రయాణాలు చేసే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రయాణికులు ఆశ్రయించే బస్​స్టాండులు అనువుగా లేక..వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Rtc Depot
Rtc Depot

By

Published : May 19, 2023, 6:21 PM IST

Updated : May 19, 2023, 9:39 PM IST

Passengers Problems In Summer: రాష్ట్రంలో రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. దాంతో పాటు వడగాలులకూ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రభావాలతో ఇంటినుంచి బయటకురావాలంటే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఎండకు తాళలేక అవస్థలు పడుతున్నారు. ఎండాకాలం కారణంగా ప్రజలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య తక్కువే ఉంటుంది. అయినా జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో సరైన వసతులు లేవు. తాగడానికి నీరు కూడా లేదు. ఫ్యాన్​లు లేకపోవడంతో నెల్లూరు జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో 8ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. గ్రామాల నుంచి నెల్లూరు నగరానికి వస్తున్న ప్రయాణికులు మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా మారింది. నెల్లూరు నగరం, కావలి, ఆత్మకూరు, కందుకూరు డిపోల్లో ఎండవేడికి ప్రయాణికులు కొద్దిసేపు కూడా నిలబడలేకపోతున్నారు. కాగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయలేదు.

ప్రజలు బస్​ స్టాండ్​లో ఉండటానికి ఏ సౌకర్యాలు సరిగాలేవని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఆర్టీసీ డిపోలో కూర్చోడానికి కుర్చీలు సరిగా లేవని.. ఉన్న కుర్చీలు కూడా చిలుముపట్టి చొక్కాలు, ప్యాంట్లు నల్లగా మారిపోతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అలాగే సరిపడా కుర్చీలు లేక, నిలబడ లేక..నీరస పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. డిపోలో ఫ్యాన్లు ఉన్నా అవి పూర్తిస్థాయిలో తిరగడంలేదని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పెద్ద బస్టాండ్ లో ఒకవైపు ఫ్యాన్లు తిరుగుతుండగా... రెండోవైపు చెన్నై, గూడూరు, సర్వేపల్లి వైపు వెళ్లే బస్సు ప్లాట్ ఫారాలలో ఫ్యాన్లు తిరగడంలేదని చెమటలతో తడిసిపోతున్నామని అంటున్నారు.

దీంతోపాటు ఆర్టీసీ డిపోల్లో పారిశుద్ద్యం సరిగాలేక దుర్వాసనలు వస్తున్నాయని నిలబడటానికి కూడా ఇబ్బందిగా ఉందని వారు తెలిరపారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తట్టుకోడానికి కనీసం తాగడానికి నీరు కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రూపాయలు ఇచ్చి మంచినీటి బాటిల్ కొనడం సామాన్యులకు కష్టంగా ఉందని.. అధికారుల నిర్లక్ష్యానికి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

బస్సుల్లో ఎక్కినా కూడా వేడిగాలులు, బస్సుల్లో సీట్లు కాలిపోతున్నాయని అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా ఆర్టీసీ డిపోల్లో వేడిగాలులు రాకుండా చుట్టూ పట్టలు కట్టాలని కోరుతున్నారు. ప్రయాణికులకు ఉపశమనం కల్పించేెందుకు ప్యాన్లు ఏర్పాటు చేయాలని... కొన్నిచోట్ల కూలర్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా మంచినీరు సౌకర్యంతోపాటు, ఉచిత మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ బస్ స్టాప్​లో ఏ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఫ్యాన్లు, కుర్చీలు తాగునీటి సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. అలాగే పరిసరాలు శుభ్రంగా లేక వస్తున్న దుర్వాసనకు కనీసం నిలబడలేకపోతున్నాం-ప్రయాణికులు

నెల్లూరు బస్టాండులో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2023, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details