నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలానికి చెందిన బాలకృష్ణ, అనిత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు ప్రయత్నించగా.. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారు ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని పోలీసులు, తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు.
దారుణం: ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి, యువతి పరిస్థితి విషమం
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఫలితంగా వారు ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జీర్ణించుకోలేని యువతి తల్లిదండ్రులు వారిపై దాడి చేసి బలవంతంగా పురుగులమందు తాగించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారాంపురంలో జరిగింది.
దారుణం : ప్రేమజంటపై తల్లిదండ్రుల దాడి, యువతి పరిస్థితి విషమం
ఇది గమనించిన యువతి తల్లిదండ్రులు.. వారిపై దాడి చేసి బలవంతంగా పురుగుల మందు తాగించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై రవీంద్ర నాయక్.. సంఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.