నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నెల్లూరు జిల్లా చేజర్ల, మర్రిపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గతంలో జరగాల్సిన ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చేజర్ల మండలం వావిలేరు, మైపాటివారి కండ్రిక... మర్రిపాడు మండలం కంపసముద్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
కడప జిల్లా వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లెలోనూ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. పెద్దవడూగురు మండలం రావులుడికి పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థి మృతి కారణంగా గతంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాసేపట్లో ఫలితాలను వెల్లడించారు.