ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన చిత్ర కళాకారులు రోడ్డుపై చిత్ర ప్రదర్శన చేశారు. చిత్ర కళాకారులు సుదర్శన్, జానీ బాషా, లక్కినేని ప్రకాశ్, ఆర్షద్.. స్థానిక పెయింటింగ్ దుకాణాల యజమానుల నుంచి రంగులు సేకరించారు. పంచాయతీ బస్టాండ్ కూడలిలో కరోనా మహమ్మారిపై ప్రజలకు అర్థమయ్యేలా... చిత్ర ప్రదర్శన చేశారు. చిత్రంలో ఒకవైపు ప్రపంచంలోని జనాభా అంతా మాస్కులు ధరించి చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని పెయింటింగ్ వేశారు. ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని, మూడు అడుగుల దూరం పాటించాలంటూ సూచించారు.
కరోనాపై అవగాహనకు రోడ్డుపై పెయింటింగ్
కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు తమ వంతు కృషి చేస్తున్నారు. రోడ్డుపై పెయింటింగ్ వేసి.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
కరోనాపై అవగాహనకు రోడ్డుపై పెయింటింగ్