నెల్లూరు జిల్లాలో 182లక్షల హెక్టార్లు సాధారణ వరిసాగు చేయాల్సి ఉంది. వర్షాలు కురవడంతో ఈ ఏడాది 2లక్షల హెక్టార్లలో అధికారికంగా సాగు చేశారు. 16లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అధికారులు ముందస్తు అంచనాతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 191కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పటికి 100కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహణ సరిగా లేక.. రైతులు రోడ్లమీదనే ధాన్యం పోసుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ మాత్రమే పనిచేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. రైతుల్లో కేంద్రాలపై నమ్మకం లేక దళారులకు అమ్మివేసేందుకు సిద్దమయ్యారు. కేంద్రాల్లో ఇప్పటి వరకు 1100మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దిగుబడులు లేక.. ధరలు లేక ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.