ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతల ఆశలపై... నీళ్లు చిమ్మిన అకాల వర్షం - కల్లూరులో వర్షం వార్తలు

మరో పది రోజుల్లో పంట చేతికందుతుంది... వచ్చే పండుగను ఆనందంగా చేసుకోవాలని కలలు కన్న రైతన్నలకు కన్నీరే మిగిలింది... అకాల వర్షం అన్నదాతల కళ్లల్లో కడగండ్లు నింపింది... వెన్ను దశలో ఉన్న వరి పంట.. భారీ వర్షంతో నేలమట్టమయ్యింది.

flood effect on paddy crop
అకాల వర్షంతో నేలమట్టం అయిన వరి పంట

By

Published : Jan 6, 2021, 12:21 PM IST

భారీ వర్షంతో వరి పంట నేల వాలింది. అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. వా‌రం పది రోజుల్లో దిగుబడి చేతికందే దశలో వర్షం కృషీవలుడు కంట కన్నీరు కా‌రేలా చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో కల్లూరు, శ్రీ ధనమల్లి, పూలతోట, మేళనాలత్తూరు తదితర గ్రామాల్లో 10వేల ఎకరాల విస్తీర్ణంలో బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాల వరి సాగు చేస్తున్నారు. అంతా ఎన్ను దశలో ఉంది. నూర్పిడిలు చేసేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వర్షం తీవ్రంగా నష్టపోయేలా చేసింది. ఇదే విధంగా ఒకటి రెండు రోజులు వర్షం కురిస్తే పంట మొత్తం దెబ్బతింటుంది. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details