ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిట్టుబాటు ధర ఇస్తేనే భూములిస్తాం' - padamati Naidupalli Farmers Dharna News

హైలెవల్ కెనాల్ పనుల్లో భాగంగా మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో తెలుగు గంగా డిప్యూటీ కలెక్టర్ వెంకటేష్ సమావేశం నిర్వహించారు. మార్కెట్​ ధర ప్రకారం ఒక ఎకరాకు రైతులు ఎంత ధర ఆశిస్తున్నారనే అంశంపై నివేదికను తయారుచేసి అధికారులు పంపించనున్నట్లు ఆయన తెలిపారు.

హైలెవల్ కెనాల్ బాధిత రైతుల ఆందోళన
హైలెవల్ కెనాల్ బాధిత రైతుల ఆందోళన

By

Published : Mar 20, 2020, 8:47 AM IST

హైలెవల్ కెనాల్ బాధిత రైతుల ఆందోళన

నెల్లూరు జిల్లా పడమటి నాయుడుపల్లి గ్రామంలో హైలెవల్ కెనాల్ పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో తెలుగు గంగా డిప్యూటీ కలెక్టర్ వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతుల పేర్లను ఆయన చదివి వినిపించారు. మార్కెట్ ధర ప్రకారం ఒక ఎకరానికి ఎంత ఆశిస్తున్నారనే అంశంపై రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు. అనంతరం వాటిపై ఒక నివేదికను తయారుచేసి అధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మార్కెట్ ప్రకారం ఇచ్చే ధర తమకు గిట్టుబాటు కాదని.... ఒక్కో ఎకరానికి రూ.8 లక్షలు ఇస్తే కానీ భూములు ఖాళీ చేసేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ప్రాణాలు పోయినా భూములు వదులుకోం'

ABOUT THE AUTHOR

...view details