రూర్కెలా పరిశ్రమ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు ఆక్సిజన్ ట్యాంకర్స్ చేరుకున్నాయి. ఒక్కొక్కటి 22 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల రెండు ఆక్సిజన్ ట్యాంకర్స్ ప్రత్యేక ట్రైన్ లో చేరాయి. జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సమక్షంలో అధికారులు ఈ రెండు ఆక్సిజన్ ట్యాంకర్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఆక్సిజన్ టాంకర్ ను జిల్లా అవసరాలకు.. మరొక టాంకర్ ను గుంటూరు అవసరాల నిమిత్తం పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ బాపిరెడ్డి, కృష్ణపట్నం పోర్టు సీఈఓ శ్రీ అవినాశ్ రాయ్, పీఆర్ఓ వేణుగోపాల్ పాల్గొన్నారు.