నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా షార్ నుంచి 12 వేల కిలో లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేశారని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లాలోని నోటిఫై చేసిన ఆసుపత్రులకు ఉపయోగపడుతుందని తెలిపారు. విపత్తు సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసినందుకు షార్కు కలెక్టర్ చక్రధర్ బాబు కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు చక్రధర్ బాబు పలు కొవిడ్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
షార్ నుంచి 12 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా
నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. షార్ నుంచి 12 వేల కిలో లీటర్ల ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
oxygen-is-given-by-shar-during-pandamic-period